రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో విషాదం
E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ మరణించాడు. ఈ ఘటనతో మృతుల సంఖ్య 6కి చేరింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి బాధితులకు వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.