VIDEO: లక్ష్మీనరసింహస్వామికి సహస్రదీపోత్సవం
JGL: ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దీపావళి పూజల్లో భాగంగా సహస్ర దీపాలంకరణ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ద్వార గోపురం, శంఖం, చక్రం, గద, స్వస్తిక్ ఆకారంలో దీపాలు వెలిగించారు. దీపాల కాంతుల్లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. నృసింహుని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకన్నారు.