యుపిహెచ్‌సి సెంటను పరిశీలించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

యుపిహెచ్‌సి సెంటను పరిశీలించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపురలోని యుపీహెచ్‌సీనీ డాక్టర్ విజయమహాలక్ష్మి (డిప్యూటీ డిఎం&హెచ్ఓ దోమకొండ) శుక్రవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యుపీహెచ్‌సీలోని ఫార్మసీని తనిఖీ చేసి మందులను సరైన పద్ధతిలో నిల్వ ఉంచడం విషయాలపై సూచనలు చేశారు. అనంతరం రిజిస్టర్‌లను రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.