కొంగోడు సర్పంచ్‌గా దుబ్బగళ్ళ స్వామి
MDK: కూల్చారం మండలం కొంగోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి దుబ్బగల్ల స్వామి 280 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సామెల్‌ను ఓడించి ఘనవిజయం సాధించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్వామి తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.