వినుకొండ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ పురస్కారం

వినుకొండ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ పురస్కారం

PLD: వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ కేసనపల్లి సుబ్బారావుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోజనిక్ ఆర్ట్స్ సర్కిల్ నిర్వహించిన పోటీలో సుబ్బారావు తీసిన "బుల్ కాంపిటీషన్" ఫోటోకు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఈ విజయం పట్ల స్థానిక ఫోటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సుబ్బారావును అభినందించారు.