సీఎంను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే
NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సీఎం చంద్రబాబును సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను సీఎంకు ఆయన వివరించారు. శ్రీశైలం, మహానంది దేవస్థానాల అభివృద్ధి, సాగునీటి పథకాలకు నిధుల మంజూరుతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, తాగునీటి కొళాయిల సౌకర్యం కోసం నిధులు ఇవ్వాలని కోరారు.