మద్యం తాగి వాహనం నడిపిన 91 మందికి జరిమానా

మద్యం తాగి వాహనం నడిపిన 91 మందికి జరిమానా

MLG: జిల్లాలో మద్యం తాగి వాహనం నడిపిన 91 మందికి కోర్టు జరిమానా విధించిందని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, 85 మందికి రూ.1,68,000, ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.