CSK బౌలింగ్ దయనీయం: ఫ్యాన్స్
IPL 2026లో CSK బౌలింగ్ దయనీయంగా ఉందని ఆ టీమ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ చేతిలో ఓటమి తర్వాత మాట్లాడుతూ.. గత 18 సీజన్లతో 10 ఫైనల్స్ ఆడిన తమ జట్టు ఇప్పుడు ఇలా ఆడటం చూడలేకపోతున్నామన్నారు. CSK నుంచి ఇలాంటి ఆట ఊహించలేదని.. బ్యాటింగ్ బాగా చేసినా, బౌలింగ్‌లో పరుగులు సమర్పించేసుకున్నారని పేర్కొన్నారు. తర్వాతి ఆటకైనా పుంజుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.