VIDEO: 'వీరబ్రహ్మేంద్ర స్వామి గృహంను పునర్నిర్మించాలి'
KDP: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణంగా సిబ్బంది గేటుకు తాళాలు వేసి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు బ్రహ్మంగారు జింక కొమ్ముతో తవ్విన బావి నీటినీ కూడా తీసుకోలేకపోయాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భక్తులు గృహాన్ని తక్షణం పునర్నిర్మించి తెరవాలని కోరుతున్నారు.