సెల్ఫ్ డిఫెన్స్‌పై మహిళలకు అవగాహన
శ్రీకాకుళంలో బుధవారం మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా పోలీసులు విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగత భద్రత, తమను తాము రక్షించుకునే జాగ్రత్తలను విద్యార్థులు తప్పకుండా నేర్చుకోవాలని తెలిపారు. అలాగే, పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.