అపరిశుభ్రంతో ఆసుపత్రి పరిసరాలు
GDWL: అలంపూర్ చౌరస్తాలో ఉన్న వంద పడకల ఆసుపత్రి ఆవరణ ప్రస్తుతం అపరిశుభ్రంగా మారింది. ఆసుపత్రి ప్రాంగణంలో ముళ్ల పొదలు, గడ్డి అధికంగా పెరిగి నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మార్చురీ గది వైపు పరిస్థితి మరింత దయనీయంగా ఉండటంతో అక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వెంటనే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.