ప్రజా సమస్యలు స్వయంగా తెలియజేయాలి: అన్నా

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 24వ వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి శుక్రవారం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. వార్డుల సమస్యలు ఉంటే స్వయంగా తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు.