నన్ను ఓడిస్తారా.. సర్పంచ్‌గా ఓడిన అభ్యర్ధి దాడి
KNR: ఆముదాలపల్లి గ్రామంలో రెండో విడత జరిగిన ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థిగా తాళ్ళ పల్లి మొగిలి అనే వ్యక్తి పోటీ చేసి గెలుపొందాడు. ఈ క్రమంలో కన్నబోయిన సమ్మయ్య తన ఓటమిని జీర్ణించుకోలేక.. ఓటమికి పెద్ది సునీత, కన్నబోయిన రవీంద్ర ప్రసాద్‌లే కారణమని భావించి వారిని దుర్భాషలు ఆడుతూ వారి ఇంటిపై దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.