విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు సస్పెండ్
VKB: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. బషీరాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన కుల్కచర్ల మండలానికి చెందిన ఎస్జీటీ మానస, స్కూల్ అసిస్టెంట్ నసీం రెహనా, పెద్దేముల్ మండలానికి చెందిన అన్నపూర్ణ పీవో విధుల నుంచి బాధ్యతారహితం కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.