'సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

'సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

AKP: సీడబ్ల్యూసీ గోడౌన్లలో పని చేస్తున్న కలాసీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలో గోడౌన్ల వద్ద కార్మికులు నిరసన తెలిపారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమణ, జద్యం అప్పారావు, సీహెచ్ వీర అప్పారావు పాల్గొన్నారు.