మన దేశ భవిష్యత్తు పిల్లల్లోనే ఉంది: ఎమ్మెల్యే
ELR: ఏలూరులో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ధైర్యానికి పునాదిగా నిలుస్తాయన్నారు. అలాగే మన దేశ భవిష్యత్తు పిల్లల్లోనే ఉందని నమ్ముతున్నానన్నారు.