VIDEO: రహదారి సౌకర్యం లేక అనేక అవస్థలు

ASR: డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ పరిధి బైలువలస గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. గ్రామంలో రహదారి సౌకర్యం లేక కురుస్తున్న అకాల వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు అంతా బురదమయంగా తయారవడంతో రాకపోకలకు అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాలలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.