'కోళ్ల పెంపకం GDP పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది'

'కోళ్ల పెంపకం GDP పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది'

కృష్ణా: పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకంలో పశు వైద్యుల పాత్ర ఎంతో ఘనమైనదని కలెక్టర్ బాలాజీ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. దేశ GDP పెరుగుదలలో పాడి, కోళ్ల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల జీవనోపాదులను మెరుగుపరచడంలో మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు.