రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
WNP: అమరచింత మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న కడుమూరు గ్రామానికి చెందిన రాజు (45) అమరచింత నుంచి చిన్న కడుమూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు అతణ్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.