పరకాల డిపో వద్ద ఉద్రిక్తత
HNK: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరకాల బస్ స్టాండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుజూరాబాద్‌కు ప్రైవేట్ డ్రైవర్‌తో బస్సు నడపాలని డిపో మేనేజర్ ప్రయత్నించగా, కార్మికులు అడ్డుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లను నిరసనతో ఆపి బస్సును చుట్టుముట్టారు. సమాచారం అందుకున్న సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన కారులను నచ్చజెప్పి ప్రయత్నం కొనసాగిస్తున్నారు.