బీమా సొమ్ము కోసం ఆశపడి.. అడ్డంగా బుక్కైంది!
E.G: బీమా సొమ్ముకోసం ఆశపడి, తన ఇంట్లోనే దొంగతనం జరిగినట్లు తప్పుడు ఫిర్యాదు చేసిన ఘటన కోరుకొండ(M) కాపరవరంలో జరిగింది. పద్మ అనే మహిళ ఇంట్లో 200గ్రాముల బంగారం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా బీమా సొమ్ము కోసమే ఈ నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేలిందని క్రైమ్ డీఎస్పీ ఎ సుభాష్ తెలిపారు. పద్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.