తిరుమలలో మొరాయించిన సర్వర్లు
AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల పే ఇన్ లింక్స్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. సిఫార్సు లేఖలపై దర్శన టికెట్ పొందిన భక్తుల ఫోన్లకు యూపీఐ లింక్ మెసేజ్ రాలేదు. దీంతో ఎంబీసీ కార్యాలయంలో భక్తులు టికెట్లు పొందుతున్నారు. ఈ క్రమంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి నిపుణులు సరిదిద్దుతున్నారు.