చురుగ్గా బొబ్బిలి - రామభద్రపురం రహదారి పనులు
VZM: బొబ్బిలి - రామభద్రపురం ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆదివారం బీటీ రోడ్డు పనులు చురుగ్గా సాగుతుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.