'గిరిజనులకు ఉపాధి కల్పించండి'

NDL: నంద్యాల పురపాలక పరిధిలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ కల్పించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ కోరారు. శనివారం జీపీఎస్ నాయకులు పురపాలక కమిషనర్ శేషన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. దుకాణాల కేటాయింపులో రోస్టర్ విధానం పాటించాలని డిమాండ్ చేశారు.