VIDEO: 'కాంట్రాక్ట్ ఉద్యోగిని తొలగించడం దారుణం'
KKD: తుని ఏరియా ఆసుపత్రిలో మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగిని తొలగించడాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్వహణ లోపాల వల్ల ఓ యువకుడి కాలికి ఆపరేషన్ చేసి, బ్లేడ్ లోపల ఉంచి కుట్లు వేసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, అమాయక కాంట్రాక్ట్ ఉద్యోగిని తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.