కలెక్టర్‌కి రిమ్స్‌లో వైద్య పరీక్షలు

ADB: జిల్లా కలెక్టర్ రాజర్షిషా సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సోమవారం మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో ఎడమ కాలు మడమ తిరగబడి నడవటం కష్టంగా మారింది. దీంతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కాలుకు ఎక్స్‌రే తీయించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.