VIDEO: కావలిలో రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు
NLR: కావలి ఉదయగిరి రోడ్డులో బుడంగుంట క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీకి తగిలింది. ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు జలదంకి మండలం చెందిన పోట్లూరి చిన్న హజరత్తయ్య, సుశీలమ్మగా గుర్తించారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.