ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలి : మహమ్మద్ రఫీ
GNTR: గ్రంథాలయాలను ఉపయోగించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కొండవీడు రచయితల సంఘం అధ్యక్షులు సయ్యద్ మహమ్మద్ రఫీ సూచించారు. ఫిరంగిపురం శాఖ గ్రంథాలయంలో గత వారంరోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. వివిధ ప్రతిభా పోటీల్లో విజేతలైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దుర్గారెడ్డి పాల్గొన్నారు.