పోషణ పక్వాడ కార్యక్రమంలో తల్లులకు అవగాహన
GNTR: పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం 4వ అంగన్వాడీ కేంద్రం పరిధిలో తల్లులకు అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆట ఆధారిత విద్యపై ఫిరంగిపురం ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్ మున్ని వివరించారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు 'ఆధార్ శీలా' కార్యక్రమం ద్వారా అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు తెలిపారు.