హిట్ లిస్ట్ నుంచి ఇరాన్ నేతల పేర్ల తొలగింపు

హిట్ లిస్ట్ నుంచి ఇరాన్ నేతల పేర్ల తొలగింపు

ఇరాన్‌పై దాడుల వేళ అమెరికా, ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ హిట్ లిస్ట్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ, స్పీకర్ మహ్మద్ ఘలిబాఫ్ పేర్లను తొలగించాయి. భవిష్యత్తులో చర్చలు జరపాల్సి వస్తే ప్రతినిధులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. అందరినీ చంపేస్తే చర్చలు ఎవరితో జరుపుతారనే ఆలోచనతో ట్రంప్ సర్కార్ ఈ అడుగు వేసింది.