బాల్య వివాహల నిర్మూలనపై వ్యాసరచన పోటీలు
NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో ఇవాళ 'బేటి బచావో-బేటి పడావో' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాల్లో రాణించాలని, 18 ఏళ్లు నిండాకే వివాహం చేయాలని కోరారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.