అందుకే కొన్ని పేలుళ్లు ఆగాయి: మహా సీఎం
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనపై తాజాగా మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ముంబై పేలుళ్ల స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఫడణవీస్.. ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌ను భద్రతాధికారులు ఛేదించడాన్ని ప్రశంసించారు. దీని కారణంగా ముంబైతో సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామన్నారు.