'వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి'

CTR: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ హాల్‌లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఈ విజయకుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావ్‌తో కలిసి వేసవి లో త్రాగునీటి సమస్య లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.