విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
సత్యసాయి: గోరంట్ల మండలం పులచేట్లపల్లి పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మధ్యాహ్న భోజన పథకం పరిశీలనలో భాగంగా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.