VIDEO: పిడుగు పడి.. గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
NGKL: వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు గురైన గీతాకార్మికుడు గునిగంటి వెంకటయ్య ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తాటి చెట్టు ఎక్కి పని చేస్తుండగా పిడుగు పడటంతో ఆయన గాయపడ్డారు. తోటి కార్మికులు వెంటనే స్పందించి కిందకు దించి చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాటి చెట్టుపై పిడుగు పడిన ఘటన వీడియో వైరల్‌గా మారింది.