ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన సదస్సు...
NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో బుధవారం ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకొని నిత్యం చేతులను శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు. అనంతరం బ్రహ్మానంద ఆచారి ఆశా వర్కర్లకు చీరలను పంపిణీ చేశారు.