పీడీఎస్‌యూ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక
NZB: ధర్పల్లి మండల కేంద్రంలో పీడీఎస్‌యూ (PDSU) డివిజన్ మహాసభ గురువారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హుస్సేన్, రాహుల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర నాయకులు ప్రిన్స్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా రాజేష్, సహాయ కార్యదర్శిగా గణేష్, కోశాధికారిగా కళ్యాణ్ ఎన్నికయ్యారని ఆయన వెల్లడించారు.