హుస్సేన్ సాగర తీరంలో మళ్లీ మ్యూజికల్ ఫౌంటెయిన్
HYD: హుస్సేన్ సాగర్‌లో మళ్లీ మ్యూజికల్ ఫౌంటెయిన్‌లు ప్రారంభంకానున్నాయి. గతంలో సచివాలయానికి ఎదురుగా రూ. 50 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఫౌంటెయిన్ ద్వారా ఎగజిమ్మే నీళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడటంతో తరచూ ఫిర్యాదులు రావడంతో కొన్ని నెలలపాటు నిలిపివేశారు. దీనిని HMDA ఇప్పుడు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ప్రాంతానికి మార్చి అందుబాటులోకి తెచ్చింది.