VIDEO: ప్రయాణికులతో కిక్కిరిసిన జగిత్యాల బస్టాండ్
జగిత్యాల కొత్త బస్టాండ్ రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీతో కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.