VIDEO: గత ప్రభుత్వ పాలకుల ఫోటోల పై పెయింటింగ్..

WGL: ప్రభుత్వాలు మారగానే పాత పాలకుల జాడలను తొలగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సలహాలు, సూచనల కోసం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించారు. వేదికల పై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోలను ప్రజాధనంతో పెయింటింగ్ చేయించారు. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత ఫొటోల పై తెల్లరంగు వేశారు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని పలువురు మండిపడుతున్నారు.