శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం

శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం

ELR: ద్వారకతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు స్వామికి పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ చేశారు.