యాంకర్ శ్రీముఖికి ముక్కంటి ప్రసాదాలు అందజేత

TPT: యాంకర్ శ్రీముఖి జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో శ్రీముఖి అభిమానులు ఆమెను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమెకు శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులకు శ్రీముఖి కృతజ్ఞతలు తెలిపారు.