వినాయక చవితికి సీఐ సూచనలు

PLD: ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పిడుగురాళ్ల CI వెంకట్రావు ముందు జాగ్రత్త చర్యలు, అధికారుల నిబంధనలను వివరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలను ఏర్పాటు చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తులు పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి ఆయన తెలియజేశారు. భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.