బాధితు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం గ్రామంలో కూటమి నాయకులు కెల్లా హేమంత్ తండ్రి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు వారి కుటుంబ సభ్యులను ఇవాళ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు ఉన్నారు.