ఎన్నికల హామీకీ శ్రీకారం చుట్టిన వార్డు సభ్యుడు
KNR: జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామపంచాయతీ 1వ వార్డు సభ్యుడు ఎర్ర రాజు ఎన్నికల వేళా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చారు. 1వ వార్డుకు చెందిన ముత్యాల శ్రీనివాస్-రంజిత దంపతుల కుమార్తె వివాహానికి రూ.5016 ఆర్థిక సాయం అందజేశారు. వార్డులోని శుభకార్యాలకు ఆర్థిక సహాయం చేసి ముందుండి పాల్గొంటానని అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.