క్రీడలతో శారీరక, మానసిక సంతోషం: కార్పొరేటర్
HYD: క్రీడలతో మానసిక, శారీరక సంతోషం పెరుగుతుందని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ దీపిక అన్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచానికి బానిసలుగా మారుతున్న యువత, దయచేసి అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు ప్రయత్నించాలని ఆమె సూచించారు. అస్మిత టోర్నమెంట్ ప్రోగ్రాంలో పాల్గొని క్రీడాకారులకు పలు సూచనలు చేశారు.