VIDEO: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పెన్నులు పంపిణీ
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం మాఘమాసం బహుళ ద్వాదశి కావడంతో స్వామివారికి ఉదయం నుంచి ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి చెంత పెన్నులు ఉంచి, పూజలు నిర్వహించి పరీక్షలకు విద్యార్థులకు పంపిణీ చేశారు.