4 నెలల్లో డీసిల్టింగ్ పూర్తి చేయాలి: MD
HYD: రానున్న 4 నెలల్లో చివరి లైన్ ORR వరకు ఉన్న నాలాలను పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ చేయాలని HMWSSB ఎండి అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా నీటి నిల్వలు, వరద ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.