పుంగనూరులో కార్మిక సంఘాలు నిరసన
CTR: పుంగనూరులో పలు కార్మిక సంఘాలు గురువారం స్థానిక NTR కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల సంఘ నాయకులు జనార్దన్ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి పాతకార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు.