చింతపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

NLG: చింతపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పార్టీలకతీతంగా నిజమైన అర్హులకు అందేలా చూడాలని, ఎంపిక విషయంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.